మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసి ఫైనల్ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి . ఇటీవలే భారత్ వేదికగా బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా హోరాహోరీగా పోరాడిన భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్యనే మళ్లీ డబ్ల్యూటీసి ఫైనల్ లో కూడా మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక భారత్లో ఉన్న పిచ్ లకి అటు ఇంగ్లాండ్ లో ఉన్న పిచ్ లకి పూర్తిగా భిన్నత్వం ఉంటుంది అని చెప్పాలి. ఇంగ్లాండులో ఉండే పిచ్ లపై అటు టీమిండియా జట్టు ఎలా ఎదుర్కొంటుంది అనేదానిపై కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు.


 ఇక ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన భారత మాజీ ఆటగాడు, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాను టీమిండియా ఎలా ఓడించదో లెక్కలు చెప్పాలి అంటూ ప్రశ్నించాడు. 2020 - 21లో ఆస్ట్రేలియాను భారత జట్టు వారి సొంత గడ్డపైనే ఓడించింది. ఇక మరోసారి స్వదేశంలో కూడా మట్టి కరిపించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసి ఫైనల్లో కూడా టీమ్ ఇండియా ఖచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడిస్తుంది. ఓడించదు అనేవాళ్ళు ఒక కారణం చెప్పండి అంటూ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండులో ఉన్న పిచ్ లపై అటు టీమిండియా 350 నుంచి 400 పరుగులు చేస్తే కచ్చితంగా గెలుస్తుంది. శుభమన్ గిల్ లాంటి ప్లేయర్లు టీమిండియా కు దొరకడం నిజంగా అదృష్టం. గత ఆరు, ఏడు నెలలుగా గిల్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు. ఈ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ ప్రదర్శనతో టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. చండీగర్లో పుట్టి పెరిగిన గిల్ ఇటీవల టెస్ట్ తొలి సెంచరీ అందుకోవడం  మంచి విషయం అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. గంగూలీ  చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: