
అయితే ఇలా ఐపీఎల్లో మొదటి మ్యాచ్ లోనే గెలిచి శుభారంభం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టుకి మాత్రం అటు వెంటనే ఊహించని షాప్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న అనుభవిజ్ఞుడు కేఎన్ విలియంసన్ ఇక గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే అతను జట్టు నుంచి పూర్తిగా దూరం కాబోతున్నట్లు సమాచారం. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లు అటు కేను విలియంసన్ దూరంగా ఉంటాడు అన్నది తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బౌండరీ ఆపే క్రమంలో అటు కేన్ విలియంసన్ మోకాలకి గాయం అయింది అని చెప్పాలి.
దీంతో అతను నొప్పితో విలువలలాడిపోయాడు. ఇక మైదానంలో ఆటను కొనసాగించలేకపోయాడు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న ఫిజియోలు అతన్ని మైదానం బయటికి తీసుకువెళ్లారు అన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కేన్ విలియమ్సన్ త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా గత ఏడాది జరిగిన మినీ వేలంలో సన్రైజర్స్ కెన్ విలియమ్సన్ ను వేలంలోకి వదిలేయడంతో.. ఢిల్లీ జట్టు అతని బేస్ ప్రైస్ అయినా రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి జట్టులో చేర్చుకుంది.