ప్రపంచ క్రికెట్లో మన్కడింగ్ రూల్ గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అయితే మన్కడింగ్ అనే పేరు వినిపించింది అంటే చాలు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అనే చెప్పాలి. ఎందుకంటే క్రికెట్లో ఇలాంటి రూల్ ఉంది అన్న విషయాన్ని అందరికీ గుర్తు చేసింది అతనే. మొదటిసారి క్రికెట్లో మన్కడింగ్ అనే రూల్ ని ఉపయోగించుకుని ఇక ప్రత్యర్థి వికెట్ పడగొట్టిన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అని చెప్పాలి. ఇక ఇప్పటికీ కూడా ఈ రూల్ గురించి ఎంతోమంది చర్చించుకుంటూ ఉంటారు. ఇది క్రీడా స్ఫూర్తిగా విరుద్ధమని కొంతమంది అంటుంటే.. ఇది ఐసీసీ రూల్ కాబట్టి ఎవరైనా మన్కడింగ్ చేయొచ్చని మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు.


 ఇక రవిచంద్రన్ అశ్విన్ తర్వాత మరికొంతమంది మన్కడింగ్ చేసి ఇక వివాదాల్లో చిక్కుకున్నారూ అన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఇప్పుడు మన్కడింగ్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటారా.. ఇటీవలే మరోసారి రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ లో మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అయితే ఇలా పంజాబ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో 4 బంతిని వేయడానికి ముందే పంజాబ్ కెప్టెన్ ధావన్ క్రీజు దాటేసాడు. ఇది గమనించిన అశ్విన్ బంతిని వేయడం ఆపేసి మన్కడింగ్ చేయడానికి ప్రయత్నించాడు.


 కానీ బంతిని బేయిల్స్ కి తగిలించకుండా దావన్ కూ వార్నింగ్ తోనే సరిపెట్టాడు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఆ సమయంలో ఇక టీమ్ ఇండియాలో సహచరుడు విషయంలో అశ్విన్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు అని చెప్పాలి. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన శిఖర్ ధావన్ అశ్విన్ చూస్తూ చేసేయాల్సింది అన్న తరహాలో చిన్న స్మైల్ కూడా ఇచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఇక ఇలా మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నించగానే కెమెరా ఒక్కసారిగా బట్లర్ వైపు తిరిగింది. ఎందుకంటే గతంలో బట్లర్ ను మన్కడింగ్ చేసి పెవిలియన్ పంపించాడు అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి: