జట్టులో స్టార్ ప్లేయర్ గా మాత్రమే కాకుండా అటు కెప్టెన్ గా కూడా టీమిండియాను ఎన్నో ఏళ్లపాటు ముందుకు నడిపించి అద్వితీయమైన విజయాలను అందించాడు అని చెప్పాలి. ఇక మరోవైపు ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఎప్పుడు తన ప్రదర్శనతో ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించే మొదటి ఆటగాడిగా నిలిచే కోహ్లీ ఇక ఇప్పుడు ఓటముల్లో నెంబర్ వన్ ఆటగాడిగా మారిపోయాడు అని చెప్పాలి.
ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా టైటిల్ గెలవడం ఆర్సిబి కి అందని ద్రాక్ష లాగే కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు జట్టు విజయంలో కీలక పాత్ర వహించే కోహ్లీ పేరిట ఒక చెత్త రికార్డు నమోదయింది. అత్యధిక సార్లు ఓటమి చవిచూసిన ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు. ఇప్పుడు వరకు 111 సార్లు ఓటమి చవి చూసాడు. ఇక తర్వాత స్థానంలో దినేష్ కార్తీక్ 109 సార్లు ఓడిన ప్లేయర్గా నిలిచాడు. ఉత్తప్ప 106 సార్లతో ఈ లిస్టులో ఉన్నాడు. ఇక ఎక్కువ మ్యాచ్లు గెలిచిన ప్లేయర్లలో ధోని 136, సురేష్ రైనా122 మ్యాచ్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారా అని చెప్పాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి