
అలాంటి శిఖర్ ధావన్ లైఫ్ లో ఇటీవలే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా శిఖర్ ధావన్ తన ఎనిమిదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడు. 2021లో భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు శిఖర్ ధావన్. అయితే ఇటీవల శిఖర్ ధావన్ మరోసారి ప్రేమలో పడ్డాడ అంటే ఇక వెలుగులోకి వచ్చిన వీడియో చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు అవును అని చెబుతున్నారు. ఈ వీడియోలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయాను అంటూ శిఖర్ ధావన్ చెప్పడం గమనార్హం.
ఇంతకీ వీడియోలో ఏముంది అంటే.. ఢిల్లీలోని ఓ ఫామ్ హౌస్ పార్టీలో ఒక వ్యక్తిని కలిసాను. ఆమెను తొలిచూపులోనే ప్రేమించానని.. ఆమెను చూడగానే తన జీవితంలో ఎప్పుడూ లేని క్లారిటీ వచ్చిందని.. ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయానని.. మాట్లాడుతుంటే వింటూ ఉండిపోవాలని పించింది అంటూ తెలిపాడు. తర్వాత రెండు రోజుల్లో తామిద్దరం కలిసి ఇంట్లో ఉన్నామని తెలిపాడు. ఒక వ్యక్తితో సెట్ అవుతుందని భావిస్తే వెయిట్ చేయకూడదు.. పాత విషయాలు మర్చిపోయి ముందుకు వెళ్లాలి అంటూ శిఖర్ ధావన్ మాట్లాడాడు. అయితే ధావన్ ఎవరి గురించి మాట్లాడాడు అన్న క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఇక మరోసారి ఈ సీనియర్ క్రికెటర్ ప్రేమలో పడ్డాడు అన్న క్లారిటీ మాత్రం అందరికీ వచ్చేసింది. మరి కొంతమంది ఇది కేవలం యాడ్ షూటింగ్లో భాగమే అని కామెంట్ చేస్తున్నారు. ఏంటో ఫ్యూచర్లో తేలుతుంది.