
ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా బలిలోకి దిగుతూ మెరుగైన ప్రదర్శన చేస్తూ గట్టి పోటీ ఇస్తూ ఉండేది ముంబై ఇండియన్స్. టైటిల్ గెలవకపోయినా అటు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వరుస విజయాలు సాధించేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యర్ధులకు కనీస పోటీ ఇవ్వలేక పోతుంది అని చెప్పాలి. దీంతో విద్యార్థుల చేతిలో భారీ తేడాతో ఘోర పరాజయాలను చవిచూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఒకప్పుడు కప్పు కొట్టడంలో రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్ ఇక ఇప్పుడు చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది.
గుజరాత్ చేతిలోనూ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ద్వారా ముంబై ఇండియన్స్ ఒక చెత్త రికార్డును కూడా నమోదు చేసింది అని చెప్పాలి. ఈ ఏడాది రెండు మ్యాచ్లలో కూడా పవర్ ప్లే లో 30 పరుగుల లోపే రన్స్ చేసింది ముంబై ఇండియన్స్. ఆర్సిబి తో మ్యాచ్లో 6 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేస్తే.. ఇటీవల గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లోని ఆరు ఓవర్లలో ఒక వికట్ నష్టానికి 29 పరుగులు చేసింది. దీంతో తొలి మూడు ఓవర్లలో కేవలం 30 లోపు మాత్రమే పరుగులు చేసింది. రెండుసార్లు తక్కువ పరుగులు చేసిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసి అత్యల్పస్కోరుతో రాజస్థాన్ తొలి స్థానంలో ఉంది.