రేపటి నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మొదలు కాబోతుంది. అయితే ఇప్పటికే ఇంగ్లాండు గడ్డపై అడుగు పెట్టి ప్రాక్టీస్ లో మునిగి తేలిన ఇరు జట్లు కూడా ఇక అధికారిక మ్యాచ్లో బరిలోకి దిగేందుకు ప్రాణాలికలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక గెలుపే లక్ష్యంగా పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులను ఢీకొట్టబోతున్నాయి. ఈ క్రమంలోనే ఒకవైపు ఆస్ట్రేలియా మరోవైపు టీమ్ ఇండియా రెండు కూడా పటిష్టమైన జట్లు కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ లో విజయం ఎవరిది అన్న విషయంపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు విశ్లేషకులు.


 అయితే ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్ళు ఇక తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా మాజీ ఆటగాళ్ల రివ్యూ చూసిన తర్వాత డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ పై ప్రతి ఒక్కరిలో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. అయితే తుది జట్టు కూర్పు ఎలా ఉండాలి అనే విషయంపై కూడా ఇక రెండు దేశాల క్రికెట్ బోర్డులకు సూచనలు ఇస్తున్నారు మాజీ క్రికెటర్లు. అయితే ఇంగ్లాండులోని ఓవల్ పిచ్ ఫేస్ కి అనుకూలించే పిచ్ కావడం గమనార్హం.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందని ఆసక్తికరంగా మారిపోయింది. ఇదే విషయంపై టీమిండియా యాజమాన్యానికి కీలక సూచన చేశాడు ఇంగ్లాండు మాజీ క్రికెటర్ మాంటి పనేసర్. భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఇద్దరు  స్పిన్నర్లతో బరిలోకి దిగాలి అంటూ సూచించాడు. ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. టర్న్ బౌన్స్ ఉండడంతో పాటు పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. పిచ్ కండిషన్స్ టీమ్ ఇండియా స్పిన్నర్లకు సరిపోతాయి. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు స్పిన్నర్ లని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారు. కాబట్టి అశ్విన్, జడేజాలకు ఇక డబ్ల్యూటీసి ఫైనల్ తుది జట్టులో ఛాన్స్ ఇవ్వాలి అంటూ పనేసర్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: