
ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహించేందుకు అటు ఎసిసి కూడా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇలా బీసీసీఐ ఆసియా కప్ విషయంలో మొండి వైఖరితో వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరోవైపు అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ విషయంలో విచిత్రమైన కండిషన్లు పెడుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్, టీమిండియా మధ్య జరగబోయే మ్యాచ్ అటు గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోతుంది.
ఇక ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అన్న విషయం తెలిసిందే. అయితే ఇక పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ కోసం అటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పాకిస్తాన్, భారత్ మధ్య జరగబోయే మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగడం విషయంపై వింత కండిషన్ పెట్టింది పాక్ క్రికెట్ బోర్డు. ఫైనల్ మ్యాచ్ తప్ప మిగతా లీగ్ మ్యాచ్ లు నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడేందుకు తాము సిద్ధంగా లేము అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజం సేతి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలకు తెలిపాడు. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.