నాగచైతన్య , సమంత విడాకుల తర్వాత వారిద్దరి గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య ఒక హీరోయిన్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు అంటూ ఒక వార్త ఇండస్ట్రీని ఊపేసింది. మేజర్ సినిమాలో నటించి తన అందంతో తెలుగు ప్రేక్షకులు అందరిని కూడా కట్టిపడేసిన శోభిత ధూళిపాలతో నాగచైతన్య రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఇలాంటిది ఏమీ లేదు అంటూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.



 అయితే అటు నెటిజన్స్ మాత్రం నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ ఇక ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత నాగచైతన్య కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా తనకు శోభిత ధూళిపాళ్లతో ఎలాంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఇక వీరి మధ్య రిలేషన్షిప్ ఉంది అంటూ వస్తున్న వార్తలకు కాస్త చెక్ పడినట్లు అయింది. అయితే ఇటీవల శోభిత ధూళిపాల చేసిన వ్యాఖ్యలతో మరోసారి నాగచైతన్య శోభిత డేటింగ్ వార్తలు కాస్త తిరమీదికి వస్తున్నాయి అని చెప్పాలి.. ఇంతకీ శోభిత ఏం కామెంట్స్ చేసింది అంటే ప్రస్తుతం శోబిత ధూళిపాళ్ల ది నైట్ మేనేజర్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.


 ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భాగంగా.. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఎలాంటి క్వాలిటీస్ కావాలి అంటూ యాంకర్ ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది. సింపుల్ గా ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. ఇతరుల పట్ల జాలి దయ గుణం ఉండాలి.. ఇక చిన్న జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తి నాకు భర్తగా కావాలి అంటూ శోభిత చెప్పింది. అయితే నాగచైతన్య సింపుల్ గా ఉంటూ ఇక బయట ప్రపంచంతో పని లేకుండా తన ప్రపంచంలో తాను ఉంటూ ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తాడు. అయితే శోభిత నాగచైతన్య గురించే ఈ మాటలు చెప్పిందా అని కొంతమంది వీరిద్దరి డేటింగ్ విషయాన్ని మరోసారి తెరమీదకి తీసుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: