అయితే బుమ్రా లాంటి బౌలర్ లేకపోవడంతో అటు టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం అంతగా పటిష్టంగా కనిపించడం లేదు. అయితే బుమ్రాకీ సహచరుడు అయినా భువనేశ్వర్ కుమార్ ఇక సరైన ఫామ్ కనబడుచు లేక జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిరాజ్ ప్రయత్నిస్తున్న అప్పుడప్పుడు తడబడుతున్నాడు అని చెప్పాలి. దీంతో ఇక ప్రత్యర్ధులను భయపెట్టేంతలా టీమిండియా బౌలింగ్ విభాగంలో ఒక్క బౌలర్ కూడా కనిపించడం లేదు. ఇక ఇదే విషయం గురించి అటు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ షహజాద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం భారత బౌలింగ్ విభాగంలో ప్రత్యర్ధులు భయపడేంతల డేంజరస్ బౌలర్ ఎవరూ లేరు అంటూ చెప్పుకొచ్చాడు షహజాద్ అహ్మద్. అయితే బ్యాటింగ్ మాత్రం ఎంతో ప్రమాదకరంగా ఉంది అంటూ తెలిపాడు. బుమ్రా, జడేజా, అశ్విన్ లాంటి బౌలర్లు అటు భారత జట్టులో ఉన్నప్పటికీ ప్రత్యర్థిని భయపెట్టి ప్రమాదకరమైన బౌలర్లు మాత్రం ఎవరూ లేరు అంటూ అభిప్రాయపడ్డాడు. తాను చూసిన డేంజరస్ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఆయనని నెట్స్ లో కూడా ఎదుర్కోవడం ఎంతో కష్టం అంటూ తెలిపాడు. కాగా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి