ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా భారత మహిళల జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న హార్మన్ ప్రీత్ కౌర్ సైతం ఇలాగే ఆగ్రహంతో ఊగిపోయింది అంపైర్ తనను ఔట్ గా ప్రకటించిన సమయంలో సహనం కోల్పోయింది హార్మన్ ప్రీత్ కౌర్ ఏకంగా వికెట్లను బ్యాట్ తో కొట్టింది. ఇక హర్మన్ ప్రీత్ ప్రవర్తనతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా చేసి ఉండకూడదు అంటూ విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే కేవలం ఇలా మ్యాచ్ మధ్యలో సహనం కోల్పోవడమే కాదు మ్యాచ్ పూర్తయిన తర్వాత అంపైరింగ్ పై విమర్శలు కూడా చేసింది హర్మన్ ప్రీత్.
ఇలా బంగ్లాదేశ్ లో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఔట్ అయినా తర్వాత వికెట్లను బ్యాట్ తో కొట్టడం విషయంపై మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ స్పందిస్తూ ఆసక్తికరమైన చేశారూ. హర్మన్ ప్రీత్ అలా ప్రవర్తించడం సరికాదు అంటూ వ్యాక్యానించాడు. మ్యాచ్ అనంతరం అంపైర్ల పట్ల హర్మన్ ప్రీత్ కౌర్ స్పందించిన తీరు ఆమోదయోగ్యంగా లేరు అంటూ వ్యాఖ్యానించింది ఈ మాజీ క్రికెటర్. తన పరిధి దాటి ప్రవర్తించిందని.. అందుకే విమర్శలు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఐసీసీ ఆమెపై తప్పకుండా చర్యలు తీసుకుంటుంది అంటూ అభిప్రాయపడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి