ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఐసీసీ టోర్నీ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ని విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ నేపథ్యంలో ఏ మైదానంలో ఏ ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నాము అనే విషయంపై అన్ని టీమ్స్ కి కూడా క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా ప్రత్యర్థులకు అనుగుణంగానే వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి అన్ని జట్లు.


 అయితే ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ వేదికగా జరిగిపోతున్న నేపథ్యంలో ఇక అటు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ రెంట్లు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయ్. అంతేకాదు ఫ్లైట్ టికెట్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇలా క్రమక్రమంగా వరల్డ్ కప్ నేపథ్యంలో ఒక్కో ధర పెరుగుతూ ఉండటం  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే వరల్డ్ కప్ ప్రారంభమైందంటే చాలు అన్ని బ్రాండ్లు కూడా తమ ప్రోడక్ట్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ని ఇవ్వాలని భావిస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ను ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ల ద్వారా ఈ యాడ్ లను ప్రసారం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్లు యాడ్స్ ద్వారా 1000 కోట్లు ఆర్జించాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే కో ప్రెసెంటర్స్ స్లాట్ కు 150 కోట్లు, అసోసియేట్ స్లాట్కు 88 కోట్లు, పవర్ బై స్పాన్సర్ కు 75 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్ కు 40 కోట్లు రేట్స్ పిక్స్ చేశారట. అయితే అటు భారత్, పాక్ మ్యాచ్ సమయంలో కేవలం 10 సెకండ్ల యాడ్ కోసం తప్పకుండా 30 లక్షలు చెల్లించాల్సిందే అనే రూల్ కూడా పెట్టాయట. ఇలా వరల్డ్ కప్ ను క్యాష్ చేసుకొని బిజినెస్ ను మరింత పెంచుకోవాలని స్టార్ స్పోర్ట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు భావిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: