ఈ మాటలు మరెవ్వరో కాదు, ఇంగ్లండ్‌ టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌ జో రూట్‌. అవును, ఆయన తాజాగా ఈ రకంగా వ్యాఖ్యలు చేయగా అవి ఇపుడు స్పొర్ట్స్ మీడియా లో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఈ ఐసీసీ టోర్నీ లో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్‌ ఇతడేనంటూ ఎవరూ ఊహించని ఒక పేరు గురించి అతగాడు ప్రస్తావించాడు. టీమిండియా రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి, ఇంగ్లండ్‌ సారథి జోస్‌ బట్లర్‌, పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం, భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. వంటి స్టార్ క్రికెటర్లను కాదని సహచర ఆటగాడికే అతగాడు ఓటేయడం ఇపుడు ఆసక్తికరం గా మారింది.

2019లో సొంత గడ్డపై తొలి సారిగా విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టులో జో రూట్‌ సభ్యుడన్న విషయం మీకందరికీ బాగా తెలిసిందే. నాటి ఈవెంట్‌ లో ఫైనల్లో న్యూజిలాండ్‌ ను ఓడించి మోర్గాన్‌ బృందం విజేతగా అవతరించింది. ఆనాటి మ్యాచ్‌ లో బెన్‌స్టోక్స్‌  84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను రేసు లో నిలిపి విజయం అందించాడు. ఈ క్రమం లో వరల్డ్‌కప్‌-2019లో ఇంగ్లండ్‌ హీరోగా నీరాజనాలు అందుకున్న స్టోక్స్‌.. మళ్లీ బరిలోకి దిగేందుకు వీలుగా వన్డేల రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కొసమెరుపు.

అయితే, ప్రపంచకప్‌-23లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా రూట్‌.. స్టోక్స్‌ పేరు చెప్పాడనుకుంటున్నారా? అంటే అది కాదనే చెప్పుకోవాలి. ఆయన ఈ సందర్బంగా మాట్లాడుతూ... “తనను తాను నిరూపించుకోవడంలో జానీ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అతగాడు అద్బుతమైన ఆటగాడు. టాపార్డర్‌లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జేసన్‌రాయ్‌తో కలిసి గొప్ప భాగస్వామ్యాలు నమోదు చేసిన ఘనత అతనికే సొంతం. పవర్‌ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో సమాధానం చెబుతాడు. ఈసారి ప్రపంచకప్‌లో మరింత గొప్పగా రాణిస్తాడనుకుంటున్నా. నా ఛాయిస్‌ జానీ బెర్‌స్టో’’ అని ఐసీసీతో రూట్‌ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: