ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఐసీసీ టోర్ని కోసం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. వరల్డ్ కప్ కావడంతో ఇక టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ విడుదల చేయడం.. అన్ని దేశాల క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ఇక జట్టు వివరాలను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే బిసిసిఐ ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో అటు తెలుగు కుర్రాడు అయినా తిలక్ వర్మకు చోటు దక్కలేదు. అయితే అతనికి తప్పకుండా చోటు దక్కుతుందని అందరూ భావించినప్పటికీ ఇక సెలక్టర్లు మాత్రం ఈ యంగ్ ప్లేయర్ను అనుభవం లేదు అన్న కారణంతో చివరికి పక్కన పెట్టేశారు అన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ జట్టులో ఒక ఆంధ్ర కుర్రాడు చోటు సంపాదించుకున్నాడు అన్న వార్త వైరల్ గా మారిపోయింది. అదేంటి తిలక్ వర్మను పక్కన పెట్టేసారు. ఇంక మాకు తెలియని ఆంధ్ర కుర్రాడు ఎవరు టీంలో చోటు సంపాదించుకుంటున్నారు అని అందరు చర్చించుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆంధ్ర కుర్రాడు చోటు సంపాదించుకుంది ఇండియన్ జట్టులో కాదు నెదర్లాండ్స్ టీంలో.


 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కోసం నెదర్లాండ్స్ ప్రకటించిన జట్టులో ఏపీలోని విజయవాడలో జన్మించిన అనిల్ తేజ నిడమనూరు చోటు దక్కించుకున్నాడు అని చెప్పాలి. న్యూజిలాండ్లో పెరిగిన తేజ ప్రస్తుతం నెదర్లాండ్స్ తరఫున క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. బ్యాట్స్మెన్ గా రాణిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు తన ఆటతీరుతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు ఈ ఆంధ్ర కుర్రాడు.  ఇక ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. దీంతో ఫ్యాన్స్ అందరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc