అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్  కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ప్రపంచ కప్ టోర్నీలో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు అన్ని జట్లు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ కోసం అటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఇక 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను కూడా ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మరికొన్ని రోజుల్లో వన్ డే వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది అని అందరూ ఎదురుచూస్తున్న వేళ.. కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని షాక్ లు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న ప్లేయర్లు గాయంబడిన  చివరికి జట్టుకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.


 దీంతో వరల్డ్ కప్ కోసం ఆయా జట్టు యాజమాన్యాలు వేసుకున్న ప్రణాళికలు మొత్తం తారుమారు అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగే న్యూజిలాండ్ జట్టుకు కూడా ఇలాంటి షాక్ తగలబోతుంది అనేది తెలుస్తుంది. ఏకంగా ఆ జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న ఆటగాడు గాయం బారినపడి జట్టుకు దూరం కాబోతున్నాడని.. ఇటీవల ఇంగ్లాండు పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ బౌలర్ టీం సౌదీ గాయపడ్డాడు. అయితే తన గాయానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాడు.


 ఈ క్రమంలోనే సర్జరీ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు టీమ్ సౌథి. దీంతో ఇక మరో రెండున్నర వారాలు మాత్రమే మిగిలి ఉన్న వరల్డ్ కప్ అతను దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా మ్యాచ్ ఫీల్డింగ్ చేస్తూ ఉండగా సౌథి కుడి చేతికి బొటన వేలుకి గాయం అయింది. అయితే స్కాన్ చేసి చూడగా బొటనవేలు లోపల ఎముక విరిగినట్లు తేలింది. దీంతో సౌథి కి సర్జరీ అనివార్యం అయింది అని చెప్పాలి. ప్రస్తుతం కివీస్ లో ఉన్న సౌథి త్వరలోనే శస్త్ర చికిత్స చేయించుకునేందుకు విదేశాలకు వెళ్లబోతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc