ఇండియా వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ ఐసీసీ టోర్నీ కోసం భారత్లోని అన్ని స్టేడియాలు కూడా సిద్ధమైపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ వరల్డ్ కప్ జరగబోతున్న నేపథ్యంలో ఈ ప్రపంచకప్ లో పాల్గొనబోయే అన్ని జట్లు కూడా ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టాయి. కొన్ని టీమ్స్ వార్మ్ ఆఫ్ మ్యాచులు కూడా ఆడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్ జట్టు కూడా.. వరల్డ్ కప్ లో భాగంగా భారత్ లో అడుగుపెట్టాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నేరుగా హైదరాబాదులో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు ఇక ఇటీవల అటు న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాళ్లు బ్యాటింగ్ తో చెలరేగిపోయారు అని చెప్పాలి. బాబర్ ఆజాంతోపాటు మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వార్మప్ మ్యాచ్ లోనే భారత గడ్డపై ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎంతో కంఫర్టబుల్గా కనిపించారు  పాకిస్తాన్ ఆటగాళ్లు. ఇకపోతే హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ ఆటగాళ్ళకు హైదరాబాద్ ఆహార రుచులన్నీ కూడా పరిచయం అయ్యాయి అన్నది తెలుస్తుంది.


 ఎందుకంటే వరల్డ్ కప్ కోసం నేరుగా హైదరాబాదు వచ్చిన పాకిస్తాన్ ప్లేయర్ల కోసం ప్రత్యేక మెనూని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక హైదరాబాదు బిర్యానీ తో పాటు చికెన్, మటన్, ఫిష్,గ్రిల్ ల్యాంప్ షాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్ ఫిష్ లాంటివి ఇక పాకిస్తాన్ ఆటగాళ్ల మెనూలో చేర్చారు అన్నది తెలుస్తోంది. అలాగే స్టీమ్ బాస్మతి రైస్, బోలోగ్నిస్ సాస్ తో కూడిన స్పాగెట్టి, వెజ్ పులావ్ లాంటివి ఏర్పాటు చేశారు. అయితే ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టు దాదాపు వారం రోజులపాటు హైదరాబాద్ లోనే ఉండబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: