
ఈ క్రమంలోనే వరల్డ్ కప్ పోరును చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు. అయితే అటు అన్ని జట్లు కూడా వార్మప్ మ్యాచ్లలో మునిగి తేలుతూ ఉన్నాయి అని చెప్పాలి అక్టోబర్ 5వ తేదీ నుంచి అధికారిక మ్యాచులు ప్రారంభం కాబోతున్నాయ్. అయితే ఇంకా అధికారిక మ్యాచ్ లు ప్రారంభం కాకముందు నుంచి కొన్ని జట్లను గాయాలు బెడద మాత్రం తీవ్రంగా వేధిస్తుంది అని చెప్పాలి. కొన్ని టీమ్స్ లో కీలక ఆటగాళ్లు గాయం బారినపడి దూరమవుతుంటే.. ఇంకొన్ని టీమ్స్ కి మాత్రం ఏకంగా కెప్టెన్ గాయం బారినపడి దూరమవుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే ప్రపంచ కప్ పోరుకు సమయం దగ్గర పడుతున్న సమయంలో అటు బంగ్లాదేశ్ జట్టుకి కూడా ఊహించని భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న షకీబ్ ఆల్ హసన్ గాయం బారిన పడ్డాడు. ప్రాక్టీస్ లో భాగంగా ఫుట్బాల్ ఆడుతూ గాయపడ్డాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. దీంతో రెండు వార్మప్ మ్యాచ్లకు దూరమయ్యాడు. అంతేకాదు ఇక వరల్డ్ కప్ లోని మొదటి మ్యాచ్ కి కూడా అతను అందుబాటులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియా ప్లేయర్ ఆస్టన్ అగర్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు అనే విషయం తెలిసిందే.