పసికూన ఆఫ్గనిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో కొత్త ఏముంది. ఆస్ట్రేలియా ఎలాగూ పటిష్టమైన జట్టు. ఇక ఆఫ్గనిస్తాన్ లాంటి చిన్న జట్టుపై విజయం సాధించడం ఖాయం. ఇక ఇది ఘనవిజయం ఎలా అవుతుంది అంటారా.. ఇది ఘన విజయం కావడానికి కారణం కేవలం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ మాత్రమే. 93 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో కోరుకుంది ఆస్ట్రేలియా. దీంతో చిన్న టీం అయినా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలోనే క్రీజు లోకి వచ్చిన మ్యాక్స్వెల్ ఒంటరి పోరాటం చేశాడు.
ఒకవైపు కాలి గాయం నొప్పి వేధిస్తూ ఉన్న. ఇంకోవైపు అటు జట్టును గెలిపించేందుకు వీరవిహారం చేశాడు. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయి.. ఏకంగా డబుల్ సెంచరీ అందుకున్నాడు. 128 బంతుల్లోని 201 పరుగులు చేసి జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు అయితే ఈ డబుల్ సెంచరీపై మాక్స్వెల్ ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబుల్ సెంచరీ తో జట్టుకు విజయాన్ని అందించినందుకు గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. నేను ఈరోజు చాలా అదృష్టవంతుడిని. 33 పరుగుల వద్ద నా క్యాచ్ వదిలేసారు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ఉండాల్సింది. 201 పరుగులు చేసినందుకు గర్వపడుతున్న అంటూ చెప్పుకొచ్చాడు మాక్స్వెల్. అయితే మాక్స్వెల్ ఊచకోత ఇన్నింగ్స్ ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు అంటూ కెప్టెన్ కమిన్స్ కామెంట్ చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి