ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ ఆన్ లక్కీ టీం ఏది అంటే క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఆ టీం ఏదో కాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ టీం ని దురదృష్టం ప్రతి సీజన్లో కూడా వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఐపీఎల్ మొదలైన నాటి నుంచి కూడా ప్రతి సీజన్లో భారీ అంచనాలు మధ్య బరిలోకి దిగుతూ ఉంటుంది బెంగళూరు జట్టు. అందరూ ఊహించినట్లుగానే లీగ్ మ్యాచ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 కానీ కీలకమైన నాకౌట్ దశకు వచ్చేసరికి మాత్రం అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శనలతో అందరిని నిరాశ పరుస్తూ ఉంటుంది. వరల్డ్ క్రికెట్లో ఉన్న స్టార్ ప్లేయర్లందరూ కూడా బెంగళూరు జట్టులో ఉన్నప్పటికీ.. ఎందుకో ఆ టీం మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ టైటిల్ గెలవలేకపోయింది అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్ లో మాత్రం టైటిల్ కొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది బెంగళూరు టీమ్. ఈ క్రమంలోనే స్టార్ ఆల్ రౌండర్ అయిన కామెరూన్ గ్రీన్ ను ఏకంగా 17.5 కోట్లు పెట్టి జట్టులోకి తీసుకుంది. ముంబై జట్టు నుంచి అతన్ని ఇక తమ టీం లోకి తీసుకోవడం గమనార్హం.


 అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం ప్రణాళికలపై అటు ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు జట్టులో పేలవంగా ఉన్న బౌలింగ్ పై దృష్టి పెట్టకుండా.. మళ్ళీ బ్యాటింగ్ ఆల్రౌండర్ ని కొన్నారు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు  హసరంగ,  హేజిl వుడ్,  హర్షల్ పటేల్ లాంటి కీలకమైన బౌలర్లను వేలంలోకి వదిలేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ఇక ఇప్పుడు బెంగళూరు టీం చేతిలో కేవలం 23.35 కోట్ల పర్స్ మణి  మాత్రమే ఉంది. ఇక ఉన్న ఆదాయంతో స్టార్ బౌలర్లను ఎలా కొనగలరు అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl