
అయితే ఇలా నిషేధం పడిన ఆటగాళ్లను తర్వాత జట్టులోకి తీసుకోవడం విషయంలో కూడా సెలక్టర్లు మొండి చేయి చూపిస్తూ ఉంటారు. నిషేధం ఎత్తివేసిన తర్వాత కూడా ఇక ఆయా ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించుకోలేరు. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అలాంటి ఆటగాళ్ళను కోచ్ లుగా నియమించుకోవడం లేదంటే సెలక్షన్ కమిటీ లో చేర్చుకోవడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్లో మాత్రం ఇలాంటిదే జరిగింది. ఏకంగా 2010లో ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి 7 నెలల జైలు శిక్ష అనుభవించిన ఆ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ను సెలక్షన్ బోర్డులో సభ్యుడిగా ఎంపిక ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది.
ఫిక్సింగ్కు పాల్పడిన ఆటగాడిని ఇక సేలక్షన్ కమిటీ లోకి తీసుకోవడం ఏంటి అంటూ అందరూ విమర్శలు చేశారు. ఇలా సల్మాన్ బట్ ను సెలక్షన్ కమిటీలోకి తీసుకోవడంతో విమర్శలు రాగా.. ఇక ఇటీవల అతని తొలగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెలెక్టర్గా ఉన్న వహాబ్ రియాజ్ సల్మాన్ ను తొలగించారు. అతన్ని కన్సల్టెంట్ గా నియమిస్తున్నట్లు వాహబ్ ఇటీవల ప్రకటించగా.. విమర్శలు రావడంతోనే మళ్లీ అతని తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.