ఎంత డబ్బు ఉంటే ఏం లాభం.. కనీసం ఆకలి తీర్చలేనప్పుడు  అంటూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే ప్రతి మనిషి పని చేసేది కడుపు నింపుకోవడానికే.. ఇక ఆ కడుపు నింపుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెనకాల లక్షలు, కోట్లు దాచుకున్న వృధానే అని చెబుతూ ఉంటారు. ఇది ముమ్మాటికి నిజమే అన్న విషయం వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే సేవింగ్స్ చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది వేలల్లో ఇంకొంత మంది లక్షల్లో మరి కొంతమంది కోట్లల్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. కానీ కనీసం కడుపునిండడానికి మాత్రం ఖర్చు పెట్టాలంటే పిసినారిలాగా ఆలోచిస్తూ ఉంటారు.


 చివరికి సరిగ్గా తినక ఏదో ఒక అనారోగ్య సమస్యకు కారణం అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఈ మధ్యకాలంలో ఎంతోమంది బిచ్చగాళ్లు భారీగా డబ్బులు సంపాదిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఏకంగా ఆ బిచ్చగాళ్ళు అనారోగ్యం బారిన పడి చనిపోయిన తర్వాత వారు ఉంటున్న ఇళ్లల్లో లక్షలు బయట పడుతూ ఉండడం కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అంతేకాదు ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వారి కంటే భిక్షాటన చేస్తూ సంపాదిస్తున్న వారి సంపాదనే ఎక్కువగా ఉంది అన్న మీమ్స్, ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.


 ఇదంతా పక్కన పెడితే.. ఇటీవలే ఒక బిచ్చగాడు ఆకలితో చనిపోయాడు. అయ్యో పాపం కడుపు నింపుకోవడానికి కనీసం చేతిలో చిల్లిగవ్వ  కూడా లేదేమో అందుకే అతనికి ఇంతటి దుస్థితి వచ్చింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అతని దగ్గర లక్షల రూపాయలు ఉన్న ఆకలితో చనిపోయాడు. గుజరాత్ లోని వలసతిలో ఈ ఘటన జరిగింది. యాచకుడు స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన కనిపించడంతో ఓ వ్యక్తి 108 కి ఫోన్ చేశాడు  మెడికల్ సిబ్బంది అతనికి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికి చనిపోయాడు. మృతుడి వివరాల కోసం పోలీసులు వస్తువులు చెక్ చేయగా 1 14 లక్షలు బయటపడ్డాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించగా కొన్ని రోజుల నుంచి అతను ఎలాంటి ఆహారం తీసుకోలేదు అన్న విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: