వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న శ్రీలంక జట్టుకు గత కొంతకాలం నుంచి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటికీ మొన్న ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నిలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన శ్రీలంక జట్టు.. చెత్త ప్రదర్శన చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. అయితే ఇక వరల్డ్ కప్ ఓడిపోయిన నిరాశలొ ఉన్న శ్రీలంక జట్టు స్వదేశానికి చేరుకుందో లేదో అంతలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్  షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డు పై నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంతో అందరూ కూడా ఒకసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇక ఆ తర్వాత ఇక లంకా బోర్డులోని పెద్దలే తమబోర్డుపై ఐసీసీ నిషేధం విధించాలని కోరినట్లు తిరమీదికి రావడం మరింత సంచలనంగా మారిపోయింది.  అయితే గత కొంతకాలం నుండి చెత్త ప్రదర్శన చేస్తున్న శ్రీలంక జట్టులో ఇక ప్రక్షాళన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కోచ్ సహా మరికొంతమంది కూడా రాజీనామాలు చేశారు. అయితే ఇక ఇప్పుడు ఇక శ్రీలంక జట్టుకు కొత్త కెప్టెన్ కూడా రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 2024 t20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని లంక బోర్డు తమ జట్టుకు కొత్త కెప్టెన్ నియమించింది. లంక టీంలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న వనిందు హసరంగను పొట్టి ఫార్మాట్ కెప్టెన్ గా నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ శనకపై వేటువేయాలని లంక బోర్డు భావిస్తుందట. టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది తెలుస్తుంది. కాగా హసరంగా ఇప్పుడు వరకు టి20 ఫార్మాట్లో 58 t20 మ్యాచ్ లు ఆడి 91 వికెట్లు పడగొట్టడమే కాదు 533 పరుగులు కూడా చేశాడు. ఐపీఎల్లో అతను సన్రైజర్స్ తరఫున ఆడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl