టీమిండియాలో సీనియర్ ఓపెనర్ గా కొనసాగుతూ వున్నాడు శిఖర్ ధావన్. ఒకప్పుడు భారత్ జట్లు మూడు ఫార్మాట్లను కూడా రెగ్యులర్ ఓపనర్ గా ఉండేవాడు అనే విషయం తెలిసిందే. ఏకంగా రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు ఓపెనింగ్ చేసేవాడు. ఇక ఎన్నోసార్లు తన అద్భుతమైన ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు మంచి ఆరంభాలు ఇచ్చాడు అని చెప్పాలి. ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టాడు శిఖర్ ధావన్. అయితే గత కొంతకాలం నుంచి యువ ఆటగాల్ళ హవా పెరిగిపోవడం.. ఇక మరోవైపు శిఖర్ ధావన్ కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉండడంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు.



 అయితే ఆ తర్వాత అతను మళ్ళీ జట్టులో అందుబాటులోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఇక సెలక్టర్లు శిఖర్ ధావన్ గురించి పట్టించుకోవడమే మానేశారు. అతను లేకుండానే ప్రస్తుతం భారత జట్టు మూడు ఫార్మాట్లలో కూడా ద్వైపాక్షిక సిరీస్లు సహా ఇక వరల్డ్ కప్ లు కూడా ఆడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే గత ఏడాది  ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో చోటు తగ్గుతుంది అనుకున్నప్పటికీ శిఖర్ ధావన్ జట్టు ఎంపికలు పరిగణలోకి తీసుకోలేకపోయారు సెలెక్టర్లు.


 ఇకపోతే శిఖర్ ధావన్ అటు జట్టుకు సెలెక్ట్ కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులకు పంచుకుంటూనే ఉన్నాడు. అయితే ఇటీవల తన ఓపెనింగ్ పార్టనర్ అయిన రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, తనది విజయవంతమైన ఓపెనింగ్ పెయిర్ అంటూ దావన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ సపోర్ట్ వల్ల నా ఆట తీరు మెరుగుపడింది. తోటి ఆటగాడికి అతడు ఎంతో కంఫర్ట్ ఇస్తాడు. దానివల్ల జట్టుకు మంచి ఆరంభం ఇవ్వగలిగే వాళ్ళం. మేమిద్దరం కలిసి 19 సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశాం. 6000కు పైగా పరుగులు చేసాం. ఆస్ట్రేలియాపై ఇద్దరం కలిసి 193 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశామ్. మాకు తెలిసి అదే మా బెస్ట్ పార్టనర్ షిప్ అంటూ చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్.

మరింత సమాచారం తెలుసుకోండి: