ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు. ఏకంగా ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసి ఈ దాయాదుల పోరులు చూసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడల్లా కూడా పాత వ్యూయర్షిప్ రికార్డులు అన్నీ కూడా అటు బద్దలవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఆ రేంజ్ లో ఈ మ్యాచ్ కి క్రేజీ ఉంది. అందుకే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకుంటూ ఉంటారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. అయితే గత ఏడాది వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో వ్యూయర్షిప్ లో ఎన్నో రికార్డులు బద్దలు  అయ్యాయి. ఇక ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ లో మరోసారి ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూసి ఉత్కంఠను ఎంజాయ్ చేయడానికి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక కొంతమంది టికెట్ కొనుగోలు చేసి నేరుగా స్టేడియం కి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించాలని అనుకుంటూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం.. ఇక టీవీలకు అతుక్కుపోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ దృశ్య అటు టికెట్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ క్రికెట్ ప్రేక్షకులు అవేవీ పట్టించుకోకుండా టికెట్లు కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. అయితే టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా జూన్ 9వ తేదీన అటు న్యూయార్క్ వేదికగా ఈ దాయాదుల సమరం జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు ప్రస్తుతం హాట్ కేకుల్లా  మారిపోయాయి. ఒక్కో టికెట్ ధర దాదాపు 500 రూపాయల నుంచి 33 వేల వరకు ఉంటుంది అని చెప్పాలి. అయితే కొంతమంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ ని క్యాస్ట్ చేసుకునే పనిలోపడ్డారు. ఏకంగా టికెట్లు కొనుగోలు చేసి వాటిని రీసేల్ వెబ్సైట్ లో ఉంచి ఏకంగా 33 లక్షల నుంచి 1. 86 కోట్లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఎంతోమంది ప్రముఖులు ఇక ఈ టికెట్లను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: