ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఒక్కసారి ఛాంపియన్గా కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎందుకో గత కొంతకాలం నుంచి మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక టైటిల్ వేటలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఎక్కడ ప్రేక్షకులను మాత్రం సంతృప్తి పరచలేక పోతుంది. చెత్త ప్రదర్శనలతో తీవ్ర స్థాయిలో నిరాశ పరుస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక టైటిల్ వేటలో అంతకంతకు వెనకబడిపోతుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.


 అయితే జట్టు యాజమాన్యం ఆటగాళ్లతో పాటు జట్టు కెప్టెన్సీ విషయంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేసినప్పటికీ.. అటు సన్రైజర్స్ కి మాత్రం లకు అస్సలు కలిసి రావడం లేదు. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటు టైటిల్ గెలవడమే లక్ష్యంగా బలులోకి దిగేందుకు సిద్ధమైన సన్రైజర్స్. ఈ క్రమంలోనే పక్క ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఇక జట్టుకు కొత్త కెప్టెన్ ని కూడా నియమించింది. ఆస్ట్రేలియా కు వరల్డ్ కప్ అందించిన ప్యాట్ కమిన్స్ ను భారీ ధర పెట్టి జట్టులోకి తీసుకుని.. అతని చేతిలో సారధ్య బాధ్యతలను  పెట్టింది. ఇక జట్టులో ఉన్న ఎంతోమంది ఆటగాళ్ళను వేలంలోకి వదిలేసి కొత్త ఆటగాళ్లను కూడా తీసుకుంది.


 ఒక రకంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇటీవల సన్రైజర్స్  హైదరాబాద్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా బౌలింగ్ కోచ్ గా ఉన్న డెయిల్ స్టేయిన్ ఇక ఈ ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో ఇటీవల కొత్త కోచ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది సన్రైజర్స్. ఏకంగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ను బౌలింగ్ కోచ్ గా నియమించినట్లు సమాచారం. 2011, 2012 ఐపిఎల్ సీజన్ లలో ఫ్రాంక్లిన్ ముంబై ఇండియన్స్ తరఫున  ప్రాతినిధ్యం వహించాడు ఫ్రాంక్లిన్. అయితే ఇక ఈ టోర్నీలో కోచ్ గా వ్యవహరించడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాలి. కాగా వ్యక్తిగత కారణాలతో అటు డైల్ స్టేయిన్ కోచ్ బాధ్యతల నుంచి నుంచి తప్పుకోవడంతో సన్రైజర్స్ కు బిగ్ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: