ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది ఇక ప్రేక్షకులు ఊహించిన దానికంటే డబుల్ ఎంటర్టైన్మెంట్ అందుతుంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైర్మెంట్ అందిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా టీవీలకు అతుక్కుపోయి మరి ఇక మ్యాచ్లను చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఇక అయితే ప్రతి టీంలో కూడా విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఎంతో మంది ఆటగాళ్లు అదరగొడుతున్నారు అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు ఐపీఎల్లో ఏకంగా 10 మ్యాచ్లు జరిగాయి.


 ఈ పది మ్యాచ్ లలో ఎంతోమంది బ్యాటర్లు విధ్వంసకరమైన ఆట తీరుతో మెరుపులు మెరిపించారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కానీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఎంతోమంది ఆటగాళ్లు ఆయా మ్యాచ్లలో వరసగా హాఫ్ సెంచరీలు చేస్తూ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నా.. హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడంలో మాత్రం విఫలమవుతున్నారు. దీంతో ఇప్పుడు వరకు పది మ్యాచ్లు ముగిసిన ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు 180 కి పైగా సిక్సర్లు ఏకంగా 270కి పైగా ఫోర్లు నమోదు అయ్యాయి. అంతేకాదు 16 కు పైగా హాఫ్ సెంచరీలు, ఐదుసార్లు 200 ప్లస్ స్కోర్ లు కూడా నమోదయ్యాయి.



 అంతే కాదండోయ్ ఐపీఎల్ హిస్టరీ లోనే అత్యధిక స్కోర్ రికార్డు కూడా బద్దలైంది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 277 పరుగులు చేసి ఇక సరికొత్త చరిత్ర సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతానికి అటు విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇలా ఆయా జట్లు భారీ స్కోర్ నమోదు లు చేస్తున్న ఒక్క ప్లేయర్ కూడా ఇప్పటివరకు సెంచరీ నమోదు చేయకపోవడం గమనార్హం. దీంతో ఈ సీజన్లో తొలి సెంచరీ చేయబోయే ఆటగాడు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ సీజన్లో మొదటి సెంచరీ ఎవరు చేస్తారని మీరు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl