ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ అన్ లక్కీ టీం గా కొనసాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2024 ఐపీఎల్ సీజన్లో కూడా నిరాశ ఎదురయ్యేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం ఈసారి అయినా టైటిల్ విజేత నిలుస్తుంది అనుకున్న బెంగళూరు టీం వరుస ఓవటములతో సతమతమవుతుంది. ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేక చివరికి దారుణమైన ఓటములను చవిచూస్తుంది. జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆ జట్టుకు మాత్రం అదృష్టం అసలు కలిసి రావడం లేదు.


 ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన ఆర్సిబి జట్టు.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతూ ఉంది. రానున్న మ్యాచ్ లలో కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్సీబీ మరోసారి కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టకుండా.  ఇంటి బాట పట్టే అవకాశం ఉంది అని చెప్పాలి. ఇలా ఇప్పటికే వరుసగా ఓటములతో జట్టు సతమతమవుతున్న నేపథ్యంలో.. ఆ టీం కి మరో బిగ్ షాక్ తగిలింది. ఆర్సిబి టీమ్ లో కీలక ప్లేయర్గా  కొనసాగుతున్న స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ గాయం బారిన పడ్డాడట. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరగబోయే మ్యాచ్ లో అతను ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ సందర్భంగా మ్యాక్సీ కుడి చేతి బొటనవేలికి గాయమైంది. ఇక నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో.. అతను వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే ఇక ఇప్పుడు అతనికి రెస్ట్ ఇవ్వాలని ఫ్రాంచైజీ భావిస్తుంది. అయితే మ్యాక్స్వెల్ విధ్వంసకర ఆటగాడు అయినప్పటికీ అటు ఐపిఎల్ లో చేత ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో సింగిల్ డిజిట్ స్కోర్ కే  అవుట్ అవ్వడమే కాదు.  ఇక డక్ అవుట్ లలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. దీంతో అలాంటి ప్లేయర్ దూరం అయితే కొత్త ప్లేయర్ జట్టులోకి వచ్చి రాణించే అవకాశం ఉంది. దీంతో మ్యాక్స్వెల్ లాంటి స్టార్ ప్లేయర్ దూరమవడం ఆర్సిబి కి లాభమా నష్టమా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl