సర్పంచ్ పోటీలో 12,690 మంది, వార్డు సభ్యుల బరిలో 65,455 మంది అభ్యర్థులు ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,204 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలో 396, రెండో విడతలో 414, మూడో విడతలో 394 సర్పంచ్‌లు ఏకగ్రీవ ఎన్నికైనారు. వార్డు సభ్యుల విషయంలో 25,864 స్థానాలు ఏకగ్రీవం. మొదటి విడతలో 9,644, రెండో విడతలో 8,304, మూడో విడతలో 7,916 వార్డు సభ్యులు ఏకగ్రీవం. మొత్తం 21 గ్రామాలు, 368 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.
ఈ ఏకగ్రీవాల సంఖ్య రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను స్పష్టంగా చూపిస్తోంది.ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు మరో బలమైన పరీక్ష. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించిన రేవంత్ ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా పైచేయి సాధిస్తారని అంచనా. ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉండటం కాంగ్రెస్ అనుకూల గాలిని సూచిస్తోంది. బీఆర్ఎస్ గతంలో గ్రామాల్లో బలమైన పట్టు కలిగి ఉన్నా, ఇప్పుడు ఆ పల్లు కోల్పోతోంది.
రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు గ్రామస్థాయి ఓటర్లను ఆకర్షిస్తున్నాయి.ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు కొత్త దిశను చూపనున్నాయి. రేవంత్ రెడ్డి గ్రామీణ తన బలాన్ని నిరూపిస్తే బీఆర్ఎస్ మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు రాత్రికల్లా పూర్తవుతుంది. రేవంత్ మరోసారి కేసీఆర్‌పై పైచేయి సాధిస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి