ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రేక్షకులందరికీ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఇంకొంత మంది ప్రేక్షకులను స్టేడియం కు తరలి వచ్చేలా ప్రభావితం చేయడంలో సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ ఐపీఎల్ హడావిడినే కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా క్రికెట్ పండుగ కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక ప్రతి మ్యాచ్ కన్నార్పకుండా వీక్షిస్తూ అసలు సిసలైన క్రికెట్ మజాని పొందుతున్నారు ప్రేక్షకులు. ఇక అన్ని టీమ్స్ కూడా టైటిల్ పోరులో దూసుకుపోతూ అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని టీమ్స్ మాత్రం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి చివరికి నిరాశ పరుస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి టీమ్స్ లో అటు పంజాబ్ కింగ్స్ జట్టు కూడా ఒకటి. ఇప్పుడు వరకు 8 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు.. కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమానార్హం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ టీం ప్లే ఆఫ్ లోకి వెళ్లడం దాదాపు అసాధ్యం అన్న విషయం అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం రెగ్యులర్ కెప్టెన్ ధావన్ అందుబాటులో లేకపోవడంతో ఆల్రౌండర్ సామ్ కరణ్ కెప్టెన్సీ అందుకున్నాడు.


 అయితే అతని కెప్టెన్సీ తో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ పై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ఒకవేళ తాను అయితే కరన్ కు ఆల్రౌండర్ గా జట్టులో చోటు ఇవ్వను అంటూ తేల్చి చెప్పాడు. ఆల్రౌండర్ అంటే బౌలింగ్ లోనో బ్యాటింగ్ లోను జట్టును గెలిపించాలి. కానీ  ఏ విభాగంలోనూ ఆడని ఆటగాడితో ఎలాంటి ఉపయోగం లేదు అంటూ కాస్త ఘాటుగానే విమర్శల గుప్పించాడు వీరేంద్ర సెహ్వాగ్. కాగా ఇటీవల జరిగిన మ్యాచ్ లో అటు బౌలింగ్లో రెండు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసిన కరణ్ బౌలింగ్లో 20 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl