వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్లలో ఒకటిగా ఏకంగా ప్రపంచకప్ టోర్నీలో మాజీ ఛాంపియన్గా కొనసాగుతున్న పాకిస్తాన్ జట్టు.. రోజురోజుకు తమ వైభవాన్ని కోల్పోవుతుందా అంటే ఇక జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే క్రికెట్ విశ్లేషకులు  అందరూ కూడా అవును అనే సమాధానమే చెబుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని ఏళ్ల నుంచి వరల్డ్ కప్ టోర్నిలలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక పోతుంది పాకిస్తాన్ జట్టు. దారుణమైన ప్రదర్శనతో అభిమానులు అందరిని నిరాశ పరుస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది.


 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు చివరికి కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశతోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఇక ఇప్పుడు వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరుగుతున్నటువంటి వరల్డ్ కప్ టోర్నీలో అయినా సత్తా చాటుతుంది అనుకుంటే మొదటి మ్యాచ్ లోనే యుఎస్ఏ లాంటి చిన్న టీం చేతిలో ఓడిపోవడమే కాదు ఇక కనీసం సూపర్ 8 దశకు కూడా చేరుకోకుండా లీగ్ దశతోనే ఇక ఇంటి బాట పట్టింది. దీంతో ఆ జట్టు ఆట తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం పాకిస్తాన్ జట్టు ఆట తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.


 అయితే ఇటీవలే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దారుణ వైఫల్యం చెందిన నేపథ్యంలో.. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోబోతుందట. జట్టులోని కొంతమంది క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేయాలని పిసిబి యోచిస్తున్నట్లు సమాచారం. చిత్త ప్రదర్శన చేసినందుకు వారికి డెమోషన్ ఇవ్వాలని నిర్ణయించిందట. ఆ దేశ క్రికెట్ ను అలాగే పాత పద్ధతిలోనే సెలక్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక టాక్ కూడా వినిపిస్తుంది. కెప్టెన్ హెడ్ కోచ్ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో పాల్గొనకుండా కొత్త రూల్స్ తీసుకురావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: