
అంతేనా ఇక ఫైనల్ మ్యాచ్ వచ్చిందంటే ఆ 11 మంది ఆటగాళ్ల పల్స్ ఏ విధంగా మారిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీవీలో మ్యాచ్ చూసే జనాలకి బీపీలు పెరిగిపోతూ ఉంటాయి . మరి అలాంటిది అంత పెద్ద గ్రౌండ్లో మాట్లాడుతున్న 11 మంది సభ్యుల బిపి - టెన్షన్ -హార్ట్ బీట్ ఎలా ఉంటాయి అనేది ఊహించుకోవచ్చు . అయితే ఇంత కష్టపడి గెలిచిన సరే కొంతమంది పర్సనల్గా అటాక్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ కోహ్లీని అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. చిన్న స్వామి స్టేడియం తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ ఘటనపట్ల చాలామంది స్టార్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . అయితే కొంతమంది ఈ ఘటన పట్ల ఆర్సిబి తప్పు ఒప్పుకుంటూ ఐపీఎల్ మేనేజ్మెంట్ కి ఆర్సిబి ట్రోఫీ ఇచ్చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఆర్ సి బి ని ఐపిఎల్ నుంచి తప్పించాలి అని సస్పెండ్ చేయాలి అని బ్యాన్ చేసి పడేయాలి అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. అలాంటి వాళ్లకి క్రికెట్ ఫ్యాన్స్ ఇచ్చిపడేస్తున్నారు. క్రికెట్ అనేది ఒక గేమ్ మాత్రమే కాదు . ఒక ఎమోషన్ . ఎంతోమంది గుండెచప్పుడు. దీన్ని అంత ఈజీగా తుడిచేయాలని చూడొద్దు అంటూ ఘాటుగానే బదులిస్తున్నారు . మరీ ముఖ్యంగా 18 ఏళ్ల కోహ్లీ కల ఇలా మైనస్ గా మారిపోవడం అందరికి బాధ గా అనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ మేనేజ్మెంట్ ట్రోఫీని వెనక్కి తీసుకుంటున్నట్లు . ఐపిఎల్ నుంచి ఆర్సిబిని బ్యాన్ చేస్తున్నట్లు ఎక్కడ ప్రకటించలేదు. ఇది కేవలం కొంతమంది జనాలు డిమాండ్ చేస్తున్న విధానం మాత్రమే . మరి చూడాలి దీని పట్ల ఐపీఎల్ ఏ విధమైన డెసిషన్ తీసుకుంటుందో..???