
బీసీసీఐ, టీవీ హక్కుల ద్వారా అంతర్జాతీయ క్రికెట్ సంస్థల నుంచి భారత్ - పాక్ మ్యాచ్ భారీ ఆదాయ వనరుగా ఉంటుంది. టికెట్, బ్రాడ్కాస్టింగ్ హక్కులు, స్పాన్సర్ డీల్‌లు, మార్కెటింగ్ ఇవన్నీ బోర్డులకు భారీ ఆదాయం ఇస్తాయి. అందుకే బీసీసీఐ ఇలా ఒక మ్యాచ్‌ను వదులుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం వారి వ్యాపార వైఖరి స్పష్టం చేస్తోందని కొందరు చెపుతున్నారు. కొందరు విమర్శకులు మాత్రం ఈ ఆదాయాన్ని పాక్‌కు చేరువ చేస్తే తిరిగి వాళ్లు అదే ఆదాయంతో మనపై దాడి చేస్తున్నారని ఆరోపించే వారు కూడా ఉన్నారు.
క్రీడా వర్గాలు మాత్రం అంతర్జాతీయ టోర్నీలో పాయింట్లు, ర్యాంకింగ్, టైటిల్ అవకాశాలను కోల్పోకుండా పోరాడాలని... మరీ ముఖ్యంగా ఆసియా కప్ వంటి టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ వదులుకున్నా అది గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా మాత్రం గతంలోలా భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పట్ల ఉన్నంత ఆసక్తి అయితే ఈ సారి ఎందుకో కామన్ జనాల్లోనూ లేదు అన్నది నిజం.