ఒకప్పుడు మామూలు చేతి గడియారాలు వాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు క్రమంగా వీటి వాడకం తగ్గిపోయి, స్మార్ట్ వాచ్ లు వాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక పిల్లలు కూడా ఇలాంటి వాచ్ లనే చాలా ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. దీంతో (goqii) అనే సంస్ధ పిల్లల కోసం ప్రత్యేకమైన స్మార్ట్ వాచ్ లను తయారుచేసింది. అయితే ఈ స్మార్ట్ వాచ్  ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దాం.



ఇప్పుడున్న స్మార్ట్ వాచ్ ల  ద్వారా పల్స్ రేట్, శరీర ఉష్ణోగ్రతలు, హార్ట్ బీట్ వంటివి సులభంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్లతోనే "గోకీ"  సంస్థ వారు స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చారు. ఇందులో 18 రకాల యాక్టివిటీ వర్కౌట్ లు  ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ గోకీ కోచ్ అనే ఆప్షన్ తో పనిచేస్తుంది.


స్మార్ట్ వాచ్ ఫీచర్లు:త్వరలోనే  కరోనా థర్డ్ వేవ్  ప్రభావం పిల్లల మీద చూపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుకు తగ్గట్టుగానే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రాథమిక ఆరోగ్యాన్ని స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో SPO2, శరీర ఉష్ణోగ్రత, హార్ట్ బీట్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.


ఇందులో గోకీ కోచ్ అనే ప్రత్యేకమైన ఆప్షన్ ఉంది. దీని ద్వారా పిల్లలకు గోల్స్, అవసరమైన వాటిని సాధించడం లో సహాయం చేస్తుంది. ఈ ఆప్షన్ లను  పిల్లలు కూడా ఫాలో కావచ్చు. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యంపై లైవ్ లో వైద్యులను కూడా సంప్రదించవచ్చు. ఇందులో ఆటలకు సంబంధించి 18 రకాల వర్కౌట్ లు అందుబాటులో  ఉన్నాయి.

ఈ వాచ్ ప్రత్యేకమైన ధర తో అమెజాన్ లో రూ. 4,999 లభిస్తుంది. ఇందులో అనేక కలర్ లతో  కూడా వాచ్ లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో బ్లూ, బబుల్ గమ్ పింక్, ఓషియన్ బ్లూ, వైట్, బ్లాక్, రెడ్ ఇలా పలు రకాల రంగులలో కూడా ఈ వాచ్ లభ్యమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: