సినిమాల మాదిరిగానే ఇప్పుడు బుల్లితెరలో కూడా ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలో అని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై  కొన్ని జంటలు  ప్రస్తుతం  ట్రెండింగ్ గా మారాయి. బుల్లితెర జంటలు అంటే ముందుగా గుర్తుకువచ్చే వారిలో యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ పైర్ అని చెప్పవచ్చు. జబర్దస్త్ లో వీరు చేసే హడావుడి మాములుగా ఉండదు. వీరిద్దరూ నిజంగానే లవర్స్ అనే అంతలా నటిస్తారు.దానికి  తగ్గట్టే వారిద్దరి కెమిస్ట్రీని మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా బాగా వాడేసుకుంది. అటు జబర్దస్త్ లో వీళ్ళ పైర్ హిట్ అవ్వడంతో,  ఢీ షోలో కూడా వీరిద్దరినీ  హోస్ట్ లుగా పెట్టేసారు. అంతేకాదండోయ్ ఈ జంటకి అభిమానులు కూడా ఎక్కువే.  అయితే వీరిద్దరి తర్వాత అంతగా ప్రేక్షకులను  ఆకట్టుకోలేక పోయిన ఒక రకమైన  కెమిస్ట్రీని హైపర్ ఆది, వర్షిణి కూడా క్రియేట్ చేశారు. హైపర్ ఆది జబర్దస్త్ లో అనసూయతో పులిహార కలిపితే ఢీ షో లో వర్షిణితో పులిహార కలపడం మొదలుపెట్టాడు. ఢీ లో హైపర్ ఆది, వర్షిణి కెమిస్ట్రీ మొదట్లో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మంచి కెమిస్ట్రీనే పండిస్తున్నారని, సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

అయితే హైపర్ ఆది  మాత్రం కాస్త సిన్సియర్ గానే వర్షిణిని తన ట్రాక్ లో పడేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది కానీ  హైపర్ ఆది విషయంలో వర్షిణి మాత్రం కేవలం అడ్వాంటేజ్ తీసుకోవాలనే అనుకుంటుంది. కానీ అంత సిన్సియర్ గా ఉండటం లేదని అందరికీ తెలిసిందే. యాంకర్ అవ్వకముందు వర్షిణి మోడలింగ్ రంగం నుంచి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించి మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాతనే యాంకర్ గా స్థిరపడింది.అభిజిత్ తో  పెళ్లిగోల రెండు వెబ్ సిరీస్ లలో నటించినది. ఇక వర్షిణి విషయంలో హైపర్ ఆది అవకాశం వచ్చినప్పుడల్లా  తన ప్రేమను వర్షిణి ముందు వ్యక్తం చేసేందుకు హైపర్ ఆది అన్ని రకాల ప్రయత్నాలు  చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు కానీ  వర్షిణి మాత్రం తనకు ప్రేమ పట్ల అంత ఇంట్రెస్ట్ లేదంటూ హైపర్ ఆది ముందే చెప్పేసింది.

హైపర్ ఆది మాత్రం ఇవేవీ పట్టనట్లు తన వైపు నుంచి  సిన్సియర్ గా ట్రై చేస్తూనే ఉన్నాడని టాక్ వినిపిస్తోంది.  వర్షిణి మాత్రం ఆదిని పట్టించుకోవడం లేదు. తాజాగా ఆమె బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ తో కలిసి బయట తిరుగుతోందనే పుకార్లు  ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.  అంతేకాదు వర్షిణి విషయంలో అభిజిత్ కొంచెం  ఇంట్రెస్ట్ చూపుతున్నాడట, ఎందుకంటే అంతకుముందే వీరిద్దరూ  కలిసి పెళ్లి గోల రెండు సీజన్లలో కలిసి నటించారు.  అప్పటి నుంచి వీరి మధ్య బంధం కొనసాగుతూ వచ్చింది. వీరి మధ్యలో హైపర్ ఆది వచ్చినప్పటికీ వర్షిణి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. ఇప్పుడు వర్షిణి విషయంలో కాస్త పక్కకు వెళ్ళమని అభిజిత్ హైపర్ ఆదికి వార్నింగ్ లాంటిది ఇచ్చాడనే టాక్  ఇప్పుడు వినిపిస్తోంది. మరి ఆది రియాక్షన్ ఏంటో చూడాలి. ఈ గొడవ ఇక్కడితో ఆగుతుందో లేదో చూడాలి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: