హౌస్ లో అరుపులు, ఆరోపణలు, వివాదాలు, కొందరి తియ్యటి చురకలు ఇలా సోమవారం చాలా స్పెషల్ గా మారిపోయింది. ఎందుకంటే ఇంటి సభ్యులు ఒకరినొకరు నామినేషన్ చేసుకునే రోజది. ఇలా సోమ, శని, ఆది వారాలు ప్రేక్షకులకు అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. నిన్న ఎపిసోడ్ లో కూడా నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఇంటి సభ్యులను వరుసగా నిల్చోబెట్టి వారి నుండి ముక్కలుగా ఒకటిగా ఉన్నా వారి ఫోటోలను ఉంచి వాటిని తీసుకుని నామినేట్ చేసి ఆ ముక్కను పూల్ పడేయాలని తెలియచేశారు బిగ్ బాస్. ఇంటి సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. నిన్న ఎపిసోడ్ మొత్తం నటరాజ్ మాస్టర్ ఆ తర్వాత లోబోనే కనిపించారు. ముఖ్యంగా నట్ రాజ్ మాస్టర్ అయితే రవి, విశ్వ లపై మామూలుగా ఫైర్ అవ్వలేదు.

నట్ రాజ్ మాస్టర్ హాట్ డైలాగ్స్ కి బిగ్ హౌజ్ టాప్ లేచిపోయింది. రవి వచ్చి నట్ రాజ్ మాస్టర్ ని నామినేట్ చేసి మీరు నిన్న గుంటనక్క అంటూ సంభాషణ మొదలుపెట్టారు. మీరు నా పేరు తీయకపోయినా ఇంటి సభ్యులందరికీ అలాగే నాకు కూడా మీరన్నది నన్నే అని అర్థమయ్యింది. అలా నన్ను గుంటనక్క అన్నందుకు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అన్నాడు. దాంతో నట్ రాజ్ మాస్టర్ ఓ అవునా నేను మిమ్మల్ని అన్నానా? నేను ఎవరి పేరు చెప్పలేదు మరి మిమ్మల్నే అన్నానని ఎందుకు అనుకుంటున్నారు. సరే ఓకే ఎందుకు అనుకుంటున్నావో నువ్వు ఏమి చేస్తే నేను అన్నానని అనుకుంటున్నావో చెప్పు అంటే మాత్రం రవి ఆ విషయాన్ని బహిర్గతం గా చెప్పలేకపోతాడు.

మాస్టర్ తెలివిగా మాట్లాడకండి ఇక్కడున్న వాళ్ళందరికీ విషయం తెలుసు మీరన్నది ఖచ్చితంగా నన్నే అన్నాడు. అందుకు మాస్టర్ సరే అయితే గుంటనక్క అనే మాట నీకు బాగా సూట్ అయిందని నీకు అనిపించినట్లుంది తీసుకో అయితే అంటూ తన ఆటిట్యూడ్ ని చూపించాడు. సో నిన్నటి ఎపిసోడ్ తో హౌస్ లో గుంటనక్క ఎవరో తెలిసిపోయింది. ఈ ఎపిసోడ్ చుసిన నాగార్జున కూడా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. గత వరం నుండి గుంత నక్క ఎవరో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: