తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సీజన్ 5 ఇంటి సభ్యులు బాగా షార్ప్ గా ఉన్నారు. రావడమే లేటు మొదటి రోజు నుండే గేమ్ ఆడటం మొదలు పెట్టేసారు. పోయిన సారి 4 వ సీజన్ లో లాగే ఈ సారి కూడా కొందరు బిగ్ సెలబ్రిటీస్ రాగా ఎక్కువ మంది పెద్దగా ప్రేక్షకులకు తెలియని వారే కంటెస్టెంట్స్ గా వచ్చారు. అయితే ఆఫ్టర్ బిగ్ బాస్ ప్రతి ఒక్కరు బిగ్ సెలబ్రిటీ అయిపోతారు అది వేరే విషయం అనుకోండి. అయితే మరి అందర్నీ పెద్ద పెద్ద సెలబ్రిటీలను తీసుకుంటే రెమ్యూనరేషన్ మరీ పెరిగిపోతుందని ఉద్దేశంతో ఆలోచించి ఇలా సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 5 ఇంటి సభ్యులు రెమ్యూనరేషన్ ఏంటో దానిపై ప్రస్తుతం ఉన్న సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

యాంకర్ రవి... గత కొన్నేళ్ళుగా తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ఈ స్టార్ కు బయట ఉన్న ఇమేజ్ ను బట్టి వారానికి రెండు లక్షల రూపాయల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత షణ్ముక్ కి కూడ అంతే రెమ్యూనరేషన్ అంటే రెండు లక్షల వరకు వారానికి అందుతున్నట్లు సమాచారం.  ఇక్కడ వారానికి ఒకసారి రెమ్యూనరేషన్ అని ఎందుకు అన్నారు అంటే, ప్రతి వారం ఎలిమినేషన్ జరుగుతుంది, కాబట్టి వారానికి రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నారు సమాచారం. కొన్ని ప్రముఖ మీడియా వర్గాలు వీరి రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ టాప్ రెమ్యునిరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ శ్రీ రామ్ చంద్ర వారానికి లక్ష రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రియకు వారానికి 40,000, లహరి కి వారానికి 80,000, ప్రియాంక సింగ్ కి వారానికి  20,000, కాజల్ కి వారానికి 27,000, లోబోకి 15,000, యాని మాస్టర్ కి 90,000, సిరికి వారానికి 20,000, నట్ రాజ్ మాస్టర్ కి 50,000, హమీదా 19,000, సన్ని కి 15,000 మానస్ కి 27,000, విశ్వ కి 35,000,  ఉమ దేవి కి 70,000 జశ్వంత్ కి 40,000, శ్వేత కు 25,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి వాస్తవంగా వారు అందుకున్న పారితోషికాలు కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటున్నట్లు రాస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: