భారతదేశంలో అతిపెద్ద రియాల్టీ షో గా గుర్తింపు పొందుతున్న షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో కూడా ఒకటి. ఈ షోలో బాగా పాపులారిటీని అందుకున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి, 3 వారాల పాటు పాల్గొనేలా చేస్తూ ఉంటారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. సెలబ్రిటీలకు వున్న రేంజ్ ను బట్టి వారికి , వారానికి చొప్పున కూడా రెమ్యునరేషన్ కూడా అందిస్తూ వుంటారు. ఇకపోతే తెలుగులో బిగ్ బాస్ నాలుగు సీజన్లలో మంచి విజయం సాధించగా, ఇప్పుడు ఐదవ సీజన్ తో మరింత టిఆర్పి రేటింగ్ సాధిస్తోంది.


బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎక్కువగా సోషల్ మీడియా స్టార్స్ అలాగే బుల్లితెర స్టార్స్ ను తీసుకు రావడం గమనార్హం. బిగ్ బాస్ సీజన్ 5 షో కూడా ఆదివారంతో 5 వారాల ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. నవరాత్రుల సందర్భంగా నాగార్జున కూడా పంచెకట్టు లో ఎంట్రీ ఇచ్చి,  అందరి చేత  వావ్ అనిపించాడు. ఇక కంటెస్టెంట్ లు కూడా సాంప్రదాయ దుస్తులలో సందడి చేశారు. ఈ కంటెస్టెంట్ లకు 9 టాస్క్ లతో 9 అవార్డులు అందిస్తామని కూడా బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది.

బిగ్ బాస్ లో ఉన్న హౌస్మేట్స్ కు టాస్క్ లు పెట్టి అందులో గెలిచిన వారికి తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన వీడియోలను చూపిస్తూ సర్ప్రైజ్ చేశారు. కొంత మంది సినీ తారలు కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన డాన్స్ వేసి అందరిని బాగా అలరించారు. మొత్తానికి ఆదివారం మొత్తం నవరాత్రుల సందర్భంగా చాలా సందడిగా కొనసాగింది. అంతేకాదు ఈ నవరాత్రులలో భాగంగానే హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ బతుకమ్మ పండుగతో ఆడిపాడేలా చేశారు.


ఇకపోతే ఆదివారం హమీద ఎలిమినేట్ అయినట్లు  బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు  తానే హీరోయిన్ అని ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇకపోతే 19 మంది కంటెస్టెంట్ ల తో ప్రారంభమైన ఈ షో ఐదు మంది ఎలిమినేట్ కాగా  14 మందితో ఈ షో కొనసాగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: