బిగ్ బాస్ సీజన్ 5 మంచి స్పీడ్ మీద ఉంది. మిగిలింది ఏడుగురే అందులోనూ ఒకరు నేడు ఎలిమినేట్ కానున్నారు. వీరి మధ్యలో జరుగుతున్న పోటీ సాదాసీదాగా లేదు బాబోయ్ అంటున్నారు ప్రేక్షకులు. పైకి బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ టాస్క్ వచ్చిందంటే వారిలోని మరో యాంగిల్ ను బయటకు తీస్తున్నారు. కాంపిటీషన్ మామూలుగా ఇవ్వడం లేదు. ముఖ్యంగా సన్ని, సిరి కి మధ్య టాస్క్ ల సమయంలో జరిగే పోటీ అంతా ఇంత కాదు. ఇక సోమ, శని, ఆది వారాలు వచ్చాయంటే బిగ్ బాస్ హౌజ్ లో ఆ కళే వేరు, ఆ స్పైసే వేరు. సోమవారం నామినేషన్లతో హౌజ్ దద్దరిల్లితే.. శని, ఆది వారాలు నాగ్ తో ఫుల్ ఫన్ మరియు ఎలిమినేషన్ టెన్షన్. ఇక ఈ శనివారం కూడా అలానే ఆసక్తికరంగా మొదలయ్యింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ ను చూపించాక నాగ్ హౌస్ మేట్స్ ను స్క్రీన్ పై కలిశారు.

కంప్లైంట్ బాక్స్ తీసుకొచ్చి హౌస్ మేట్స్ ముందు ఉంచగా...అందులో మీకు గత రెండు వారాల్లో ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉందో వారి పేరు రాసి అందులో వేసి ఆ కంప్లైంట్ ఎందుకో చెప్పమన్నారు హోస్ట్ నాగార్జున. ఈ క్రమంలో సిరి షన్ను తనని పెద్దగా పట్టించుకోవడం లేదు అన్నట్లుగా మాట్లాడితే, అదేంటి షన్ను కాస్త పట్టించుకో సిరిని అని అన్నారు నాగ్. మళ్ళీ గార్డెన్ ఏరియాలో మరో గేమ్ ఆడుతున్నప్పుడు ఓ సందర్భంలో సిరి నన్ను ఎక్కువ తిడుతున్నాడు సార్ అంటే...మళ్ళీ నాగ్ ఏంటి షన్ను ఇది సిరికి ఒక కూల్ ఫ్రెండ్షిప్ హగ్ ఇచ్చెయ్ అంటూ దగ్గరుండి మరి హగ్ ఇప్పించాడు. దాంతో ఈ విషయం పై ప్రస్తుతం బయట పెద్ద చర్చ జరుగుతోంది.

హౌజ్ లో ఉన్న వాళ్లకి ఈ జంట పాముల విషయం పెద్దగా కనిపించకపోవచ్చు, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో వినిపించకపోవచ్చు కానీ హౌజ్ బయట ఉన్న నాగ్ తెలిసి కూడా ఇలా షన్నును ఎంకరేజ్ చేసి మరీ హగ్ ఇప్పించడం, సిరిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం.. ఏం బాగాలేదు సార్...అయినా ఇదేం పాడు పని సారు.!! అంటున్నారు నెటిజన్లు. ఇక షన్ను, సిరి ల మధ్య హౌజ్ లో జరుగుతున్న హాట్ హాగ్ లు అలానే కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: