ప్రస్తుతం ఇరువురి ఇంటిలోనూ ఈ విషయం పై పెద్దల మధ్యన చర్చలు జరుగుతుండగా వన్స్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ విషయాన్ని ఫ్యాన్స్ కు మరియు సన్నిహితులకు చెప్పి ఆనందాన్ని పంచుకోవాలని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది ఆ జంట. చాలామంది సెలబ్రిటీలు అదే ఫీల్డ్ ఉండే వారినే పెళ్లి చేసుకుంటుంటారు. మొదట్లో వారితో ఏర్పడిన పరిచయాలు, వారి అభిరుచులు దగ్గరవడం, వారి మద్య బంధం మరింత బలపడటం వంటివి వారిని ఒకటయ్యేలా చేస్తాయి. చాలా మంది సెలబ్రిటీలు ఇలా వివాహ బంధంతో ఒకటయ్యారు. సీరియల్ నటులు కూడా చాలా మంది ఇలాగే అదే ఫీల్డ్ లో ఉన్న వారిని వివాహం చేసుకున్నారు.
సినీ తారలకే కాదు సీరియల్ నటులకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. మంచి అభినయం ఉండాలే కాని మన తెలుగు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఇక వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. మరి వీరిద్దరి మొదలైన ఈ బంధం పెళ్లితో ఒక్కటవుతుందా లేదా ప్రేమతోనే సరిపెట్టుకుంటారా అన్నది తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు.