బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గేమ్ చివరి వరకు ఎంత రసవత్తరంగా సాగిందో తెలిసిందే. అయితే సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ల విషయంలో మొదట్లో కాస్త చప్పగా అనిపించింది. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు పెద్దగా ప్రేక్షకులకు పరిచయం లేనివారే. ఇదే విధంగా సీజన్ 3 లో జరిగిన విషయం తెలిసిందే. అయితే పోను పోను అలవాటు పడ్డారు, ఫ్యాన్స్ పెరిగారు అది వేరే విషయం. అయితే సీజన్ 1, 2 లలో వచ్చిన హుషారు ఆ లెవలే వేరే. కాగా ఈసారి సీజన్ సిక్స్ కేవలం మరో రెండు నెలల్లో మొదలుకానుంది అని ముందుగానే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గ్రాండ్ ఫినాలే సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

మాములుగా అయితే ఆరు నెలల తరువాత బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా కేవలం అంటే రెండే నెలల్లో తిరిగి స్టార్ట్ కాబోతుంది అంటే బిగ్ బాస్ ప్రేమికులకు పండుగలాంటి వార్త అనే చెప్పాలి. అయితే ఈసారి సీజన్ సిక్స్ లో ఇంటి సభ్యుల్ని సెలెక్ట్ చేసే విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం  పెద్ద నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి బిగ్ సినీ సెలబ్రిటీలను రణగం లోకి దించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుండే బిగ్ బాస్ వీక్షకులకు ఫుల్ జోష్, ఆసక్తి ఉండేలా కసరత్తులు చేస్తున్నారట.

అయితే ఇంతకీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సందడి చేయబోయే ఆ బిగ్ స్క్రీన్ సెలబ్రిటీలు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కాగా ఎందుకు  సీజన్ సిక్స్ ను ఇంత త్వరగా స్టార్ట్ చేస్తున్నారు అనే విషయం చాలా మందికి తెలియక సతమతమవుతున్నారు. అయితే కరోనా కారణంగా సీజన్ 5 లేట్ గా స్టార్ట్ అవడంతో, ముందుగా స్టార్ట్ చేయడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: