ఈ టీవీలో మొదలు అయిన సీరియల్ శ్రీమంతుడు.. ప్రసారం అయిన కొద్ది రోజుల్లోనే విశేషంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మంచి గుర్తింపు పొందింది.. ఈ సీరియల్ లో నటిస్తున్న కావేరి తన అందంతో, నటనతో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది..ఇక ఇప్పుడు శ్రీమంతుడు సీరియల్ లో కావేరీ రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం..


కావేరి అసలు పేరు షఫ్నా నిజామ్.. కావేరి 1991 జూన్ 17వ తేదీన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం క్యాపిటల్ లో కావేరి జన్మించింది. కావేరి తల్లి పేరు షఫీదా తండ్రి పేరు నిజామ్.. ఇక ఈమెకు ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. కావేరికి చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి ఉండడం.. స్కూల్ కి వెళ్ళినా సరే అక్కడ తన నటనతో  పిల్లలను ఆకట్టుకుంటూ ఉండడంతో ఉపాధ్యాయులు సినీ రంగం లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నావా అని అడిగారట..


ఇదే విషయమై కావేరి తన తల్లిదండ్రులకు చెప్పి నటించాలనే కోరిక ఉందని ఎలాగైనా సరే సినిమాలలో చేసే అవకాశాన్ని వచ్చేలా చెయ్యమని అంత చిన్న వయసులోనే కోరిందట.. మలయాళం సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనా జీవితాన్ని మొదలు పెట్టింది కావేరి. అంతేకాదు పలు సినిమాల్లో కూడా నటించి మలయాళం ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు గా మారిన కావేరి ఆ తర్వాత తన నటనతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మలయాళం లోనే కాదు తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో కూడా కావేరి నటించి మెప్పించింది. తెలుగు లో రజినీకాంత్ జగపతి బాబు కలిసి నటించిన కథానాయకుడు చిత్రం లో ఈమె నటించింది.

ఇక ఈ మధ్య కాలంలో మలయాళం సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. సహా యాత్రిక సీరియల్ కి గాను కేరళ బెస్ట్ టీవీ యాక్ట్రెస్ గా అవార్డును కూడా పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: