తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది యాంకర్ లాస్య. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మాటలతో చలాకీతనంతో ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకుంటూ ఉంది. ఇక తను ఎప్పుడూ స్టేజ్ మీదకి వెళ్ళినా కూడా చాలా సరదాగా నవ్వుతూ సందడి సందడిగా ఉండేలా చేస్తూ ఉంటుంది. తెలుగు ఫీమేల్ యాంకర్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది లాస్య. ఇక తన వివాహం తర్వాత కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరం అయింది.


ఆ తరువాత రీ ఎంట్రీ ఇవ్వాలని చూసిన కూడా ఇవ్వలేకపోయింది. దీంతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేసుకొని అందులో కొన్ని వీడియోస్ ప్రారంభించింది. దీంతో ఈ వీడియోస్ ద్వారా  అభిమానులకు మరింత దగ్గరయింది అని చెప్పవచ్చు. ఇటీవల యూట్యూబ్ ఛానల్ లో తన అత్తగారి ఇంటిని కూడా చూపించిన లాస్య తాజాగా తన సోదరుడికి బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చిన విషయాన్ని కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. ఇక వీడియోలో లాస్య తన అన్నయ్య ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ ని వాడుతున్నారు కనుక అందుకోసం తన అన్నయ్య కి ఒక కొత్త బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలియజేసింది.

లాస్య ఆర్డర్ చేసిన మూడు నెలల తర్వాత ఈ బైక్ ను డెలివరీ చేస్తామని తెలియజేశారట. ఇక తను మాట్లాడుతూ.. నవంబరు నెల మా అన్నయ్య బర్తడే.. నవంబర్ లో అయిపోగా లేటుగా ఈ బండి తనకు గిఫ్ట్ గా ఇస్తున్నానని లాస్య తెలియజేయడం జరిగింది. మొదటగా లాస్య ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుక్ చేయగా అది తన అన్నయ్యకు ఇష్టం లేకపోవడంతో యూనికాన్ బైక్ గిఫ్ట్ గా ఇచ్చానన్నట్లు తెలియజేసింది. తన అన్నయ్య కు తెలియకుండానే తనను తీసుకుని వెళ్లి ఆ బైక్ తనకే అని చెప్పి తన సోదరుడు కి షాక్ ఇచ్చింది.. ఇది కూడా వీడియో చేయాలా అని ఆమెపై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: