యాంకర్ వర్షిణి ప్రస్తుతం బుల్లితెరకు కాస్త దూరంగా ఉంటోంది అని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి షోలలో ఆఫర్లు రాలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈమె బుల్లితెరను వదిలేసింది అన్నట్లుగా సమాచారం. సమంత తో శాకుంతలం సినిమా, సుమంత్ తో మళ్ళీ మొదలైంది సినిమాలలో నటించి చాలా బిజీగా ఉండేది.. అయితే మళ్ళీ మొదలైంది సినిమా మాత్రం ఓటిటీలో విడుదలైంది. ఇక ఈ చిత్రంలో తనకి ప్రాముఖ్యత ఉన్న పాత్ర దొరికింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈమె కు బుల్లి తెర నుండి వెండితెరకు కూడా ఎక్కువగా అవకాశాలు రాలేదు.


కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటుంది వర్షిణి. తన అందాలను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు అని చెప్పవచ్చు. వర్షిని షేర్ చేసిన కొన్ని ఫోటోలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా యాంకర్ వర్షిణి ఒక పోస్ట్ చేయడం జరిగింది.. అదేమిటంటే ప్రస్తుతం తనకు వయస్సు 26 యేళ్లు వచ్చాయి కానీ ఇంకా వివాహం కాలేదా..? చేసుకోలేదా.? అనే ప్రశ్న తనకు ఎదురయ్యింది. అందుకు సమాధానంగా యాంకర్ వర్షిని ఏం చేసిందంటే.వర్షిణి మాట్లాడుతూ.. మనం 2022 లో కి వచ్చాం. అయినా కూడా ఎవరి పని వారు చేసుకోకుండా ఇతరుల గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లుగా తెలియజేసింది. అయితే తన వివాహం ఎప్పుడు అనేది మాత్రం చెప్పకుండా అందరికీ షాక్ ఇచ్చింది. వర్షిని గతంలో లవ్ ఫెయిల్యూర్ అన్న సంగతి ఎవరికీ తెలియకపోవచ్చు. గతంలో ఒకసారి నిశ్చితార్థం కూడా జరిగి అది వివాహం వరకు వెళ్లలేదు. మధ్యలో డీ షో వల్ల.. ఆది తో ట్రాక్ బాగా వైరల్ గా మారింది. ఇక అప్పట్లో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని యూట్యూబ్ లో కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: