బిగ్ బాస్ సీజన్ లో పోటీ రసవత్తరంగా ఉంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా హౌస్ లో అమ్మాయిల సందడి ఎక్కువగా ఉంది. అంతే కాకుండా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల ఆట చూడడానికి చాలా బాగుంది. అమ్మాయిలు తమకు అవకాశం దొరికినా లేకుండా మంచి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా గీతూ, ఆరోహి, ఇనయ సుల్తానా లు హౌస్ ను దడదడలాడిస్తునారు. వీరితో ఆర్గ్యుమెంట్ పడితే సాధించడం చాలా కష్టం, అంతలా మిగిలిన ఇంటి సభ్యులకు టఫ్ గా మారారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఏకంగా 10 మంది ఉండడం తెలిసిందే. వారిలో రేవంత్, ఇనయ, శ్రీహన్, కీర్తి, గీతూ, రాజ్ , సూర్య, అర్జున్ కళ్యాణ్, సుధీప మరియు ఆరోహిలు ఉన్నారు.

అయితే ఈ వారం జరుగుతున్న ఓటింగ్ ప్రకారం రేవంత్, ఇనయ మరియు శ్రీహన్ లు టాప్ త్రి లో ఉన్నారట. ఇక కీర్తి మరియు గీతూ లు కూడా తా ఓటింగ్ లో సేఫ్ అయినట్లు తెలుస్తోంది. కానీ మిగిలిన అయిదుగురు సభ్యులు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. కాగా గత వారాలతో పోలిస్తే... ఈ వారం ఇనయ సుల్తానా కు ఓటింగ్ చాలా మెరుగుపడిందని అనధికారిక సైట్ ల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఓటింగ్ కు కారణం.. శ్రీహన్ తో జరిగిన పిట్ట గొడవ వలన తనకు సానుభూతి వచ్చిందని అంటున్నారు, మరికొందరు మాత్రం ఇనయ ఆటతీరు మరియు ఉన్నది ఉన్నట్లు చెప్పే లక్షణం. స్నేహానికి తానిచ్చే విలువ లాంటి ఎన్నో గుణాలు తనకు ఈ రకమైన ఓటింగ్ ను తెచ్చిపెట్టాయని అంటున్నారు.

ప్రస్తుతం రేవంత్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న ఇనయ ఇలాగే ఆడితే విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతోంది. అయితే బయట వినబడుతున్న సమాచారం ప్రకారం సుదీప లేదా అర్జున్ కళ్యాణ్ లలో ఒక్కరు ఇంటిని వదిలి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయట.  

మరింత సమాచారం తెలుసుకోండి: