
ఇక వివాహమైన తర్వాత కుటుంబ సభ్యుల కారణంగా చాలా బాధను అనుభవించానని కొన్ని గృహ సమస్యలు కూడా ఎదుర్కొన్నారని తన భర్త తనను ఎక్కువ గా వేధిస్తూ ఉండేవారని పోలీస్ స్టేషన్లో ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలుపు తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా కౌసల్య తెలియజేయడం జరిగింది. తాను వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని అప్పట్లో తన బాబు చాలా చిన్న పిల్లవాడని వాడికి తండ్రి ప్రేమ దూరం చేసేందుకు తనకు ఇష్టం లేదని అందుచేతనే ఎన్నో బాధలను అనుభవించానని తెలియజేస్తోంది కౌసల్య.
ఇక తన భర్త మరొక పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకుపోయారని దీంతో ఓపిక ప్రయత్నించినట్లు ఆమె ఆవేదనను తెలియజేస్తోంది. కానీ కుదరలేదని బాబు పెద్దవాడు కావడంతో ప్రస్తుతానికి బాగానే ఉన్నానని ఇప్పుడు.. తన కొడుకు మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోమని తెలియజేస్తున్నట్లు తెలుపుతోంది కౌసల్య. అలాగే తన పుట్టిన ఇంటి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. ఫాదర్ చిన్న వయసులోనే చనిపోయారని అమ్మ తనను పెంచి పెద్దది చేసిందని ఎనిమిదేళ్ల క్రితం ఆమె మరణించిందని ఇప్పుడు తనే నా లోకం తన పాటకి మంచి గుర్తింపు వస్తే ముందుగా ఎక్కువగా సంతోషపడే ఇది మా అబ్బాయి అని తెలుపుతోంది కౌసల్య.