అసలు విషయంలోకి వెళితే ఆ ఫోటోలో చిరంజీవి పక్కన కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఇప్పుడు బుల్లితెరపై పవర్ఫుల్ లేడీ విలన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలు సినిమాలలో కూడా విధంగా కనిపించిన ఆమె ఇప్పుడు బుల్లితెరపై అనేక సీరియల్స్ లో కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది. ఆమె ఎవరో కాదు నళిని.. వీడే సినిమా లో లేడీ విలన్ గా నటించిన ఈమె సీతయ్య సినిమాలో కూడా విలన్ గానే కనిపించింది. ఇక ప్రస్తుతం సీరియల్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె 1980లో తెలుగుతోపాటు తమిళ్ హీరోయిన్ గా కూడా అనేక చిత్రాలలో నటించి మెప్పించారు.ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లో లేడీ విలన్ గా అలరిస్తున్న నళిని చిరంజీవితోనే ఏకంగా రెండు సినిమాలలో నటించింది. 1983లో వచ్చిన సంఘర్షణ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ తర్వాత 1984 లో వచ్చిన ఇంటిగుట్టు సినిమాలో కూడా చిరంజీవి సరసన హీరోయిన్గా నటించింది. ఇక అలా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఈమె చివరిగా 1988 లో వచ్చిన కుంగుమకోడు అనే సినిమా లో చివరిసారిగా హీరోయిన్గా నటించినది. ఇక ప్రస్తుతం పలు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి