
వెండితెర మీదే కాదు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాను కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఒక నటి తన బాధను చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు గౌతమి కపూర్. ఈమె గురించి హిందీ ఫిలిం ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. సాటర్డే సస్పెన్స్, ఫ్యామిలీ నెంబర్ వన్, సిఐడి తో దుమ్ము రేపు నైమిస్టార్ ప్లస్ లో ప్రసారమైన కేహ్త హై దిల్ జయ పాత్రతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. సీరియల్ చేస్తున్న సమయంలోనే రామ్ కపూర్ తో డేటింగ్ చేసి 2003లో ప్రేమికుల దినోత్సవం తర్వాత పెళ్లి పీటలు ఎక్కారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.. రామ్ కపూర్ తో పెళ్లికి ముందే ఈమెకు మాధుర్ ష్రాఫ్ తో విడాకులు జరిగాయి.
ఇండస్ట్రీలో ఎన్నో ఫీట్స్ అందుకున్న ఈమె 50 ప్లస్ లో కూడా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంది. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 12 ఏళ్ళ వయసులో ముంబైలోని ఒక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నానని, ఒక రోజు స్కూల్ నుంచి బస్సులో ఇంటికి వస్తున్నప్పుడు ఒక అతను అసభ్యంగా తాకుతూ తన స్కర్ట్ లోపల చేయి పెట్టాడని, దీంతో భయపడి వెంటనే బస్సు దిగిపోయాను అంటూ చెప్పుకొచ్చింది గౌతమి. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా ఆ వ్యక్తిని చెంప దెబ్బ కొట్టాల్సిందని, ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండాలని తెలిపింది అని చెప్పుకొచ్చింది గౌతమీకపూర్. ప్రస్తుతం తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది.