
కానీ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్షిణి వెండితెర పైన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనకి ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని వెల్లడించింది.. కానీ అక్కడ ఆడిషన్స్ కోసం వారు హోటల్ కి రావాలని డైరెక్టర్ పిలిస్తే వెళ్లానని కానీ ఆడిషన్ అయిపోయిన తర్వాత నీ నటన బాగుంది ఫిజిక్ కూడా బాగుంది.. నువ్వు ఈ వెబ్ సిరీస్ కి బాగా సరిపోతావు అంటూ డైరెక్టర్ చెప్పడంతో ఆనందపడ్డానని..ఇక అవకాశం వచ్చింది అనుకున్న సమయంలో.. అప్పుడే డైరెక్టర్ బుద్ధి బయటపడిందని.. తనతో పాటు గదిలో ఉండాలని బెడ్ పైకి లాగే ప్రయత్నం చేశారని వెల్లడించింది.
అయితే అదంతా చూసి తనకి భయం వేసి అక్కడి నుంచి బయటికి వచ్చేసానని ఆ తర్వాత కొన్ని గంటలపాటు ఏడ్చేసానని తన జీవితంలో ఒక భయంకరమైన సంఘటన అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది వర్షిణి. కానీ డైరెక్టర్ పేరు చెప్పలేదు..మధ్యలో చిన్నచిన్న చిత్రాలలో కూడా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఎందుకో అటు వెండితెర పైన బుల్లితెర పైన కూడా సక్సెస్ కాలేదు.
సుమారుగా ఏడు చిత్రాలలో కూడా నటించింది.. అలాగే పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. పలు టీవీ షోలకు యాంకర్ గా చేసిన కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదు. అయితే తిరిగి అభిమానులు బిగ్ బాస్ లోనైనా , షోలలో యాంకర్ గా అయిన అవకాశం కోసం ప్రయత్నాలు చేయాలి అంటూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.