ఇండియాలో నెంబర్ వన్ రియాల్టీ షోగా పేరు పొందింది బిగ్ బాస్ షో. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ షో కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. మొదట విదేశాలలో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత హిందీలో అడుగుపెట్టి చాలా ప్రాంతీయ భాషలలో కూడా ప్రవేశించింది. హిందీలోనే ఎక్కువగా సీజన్ లో కొనసాగుతూ ఉంది బిగ్ బాస్. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పటికి హొస్టు గానే వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా 19వ సీజన్ కూడా మొదలు కాబోతోంది.


అయితే ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది.హిందీ బిగ్ బాస్ టెలివిజన్ సీజన్ కంటే ముందుగానే ఈసారి ఓటిటి సీజన్ 4 స్ట్రిమింగ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాటిని రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టెలివిజన్ షో కూడా రద్దు అవుతుందనే విధంగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు నిర్మాతలు పలు రకాల చానల్స్ ఒప్పందాలపై విభేదాలు కూడా వచ్చాయని అందుకు తగ్గట్టుగా కథలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.


ఓటిటి హక్కులు రద్దు కావడంతో టీవీ బిగ్ బాస్ ను కూడా కాస్త ముందుగానే స్ట్రిమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉండడంతో చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఆగస్టు 3వ తేదీన బిగ్ బాస్ హిందీ సీజన్ -19 ప్రసారం కాబోతున్నది. ఇందుకు సంబంధించి సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కంటెస్టెంట్స్ గా రాజ్ కుంద్రా, ధీరజ్ ధూపర్, పైసల్ షేక్, డైసీ షా, రామ్ కపూర్, ఆరిష్ప, గౌతమీ కపూర్, ఫ్లయింగ్ బీస్ట్, మరి కొంతమంది లిస్టులో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: