బిగ్ బాస్ హౌస్ లో తన చేష్టలతో రచ్చ చేసిన బోల్డ్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి చెప్పాల్సిన పనిలేదు.  హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎవరు ఎలా అనుకున్న సరే సోషల్ మీడియాలో, సినిమాలలో తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇనయా తన ఒంటిపైన కొన్ని గాట్లను చూపిస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో వీడియోలను ఫోటోలను విడుదల చేసింది. అయితే వీటిని చూసి అటు అభిమానులు  అసలు ఇనయాకు ఏమైందో అంటూ తెగ కంగారు పడుతున్నారు.


ఇనయా గుర్రపు స్వారి , జిమ్ కసరత్తుల ఫోటోలను వీడియోలను  షేర్ చేసింది. బరువైన డంబెల్స్  మోస్తూ వివిధ భంగిమలలో కేక పుట్టించే విధంగా ఇనయా సుల్తానా ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇటువంటి సందర్భంలోనే తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒంటిపై పడ్డ గాట్లను కూడా ఓపెన్ చేసి మరి చూపించింది. కానీ ఈ గాట్లు ఎందుకు పడ్డాయో అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎవరికి నచ్చిన క్యాప్షన్ ని వారు ఊహించుకోండి అన్నట్టుగా తెలియజేసింది.


అటు మెడ పై ఉన్న గాట్లను చూపిస్తూ ఇనయా ఏదైనా లిమిట్స్ దాటినట్టుగా ఉందా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఫోటోలకు క్యాప్షన్ గా"మీరు ఈరోజు నేర్చుకున్న పాఠం ద్వారా సాధించేవరకు కష్టపడుతూ ఉండండి అంటూ.. మెడ కింద.. ఎదకి దగ్గరగా ఉన్న గాట్లను చూపిస్తూ స్టోరీస్ లో వీడియోను షేర్ చేసింది ఇనయా సుల్తాన్. గడిచిన కొద్ది నెలల క్రితం జిమ్ ట్రైనర్ గౌతమ్ తో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది. వీరిద్దరూ కలిసి గోవా ట్రిప్పులు, లాంగ్ డ్రైవ్ లకు వెళ్లిన వీడియోలను కూడా షేర్ చేశారు.  అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: